Modi Govt: భాజపా లక్ష గ్రామాల సందర్శన

తాజా వార్తలు

Published : 26/05/2021 22:11 IST

Modi Govt: భాజపా లక్ష గ్రామాల సందర్శన

దిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు ఎక్కుపెట్టాయి. వాటిని అధిగమించేందుకు భాజపా పలు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. దేశంలోని లక్ష గ్రామాల సందర్శనకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రజల అభిమానం చూరగొంటూ మోదీ ప్రభుత్వం ఏడో వార్షికోత్సవాన్ని నిర్వహించాలనుకుంటోంది. 2014 మే 30న కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు సాయం అందించాలనుకుంటోంది. కేంద్ర మంత్రులకు, భాజపా అధికారంలో ఉన్నచోట రాష్ట్ర మంత్రులకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్దా మార్గదర్శకాలు జారీ చేశారు. ఒక్కొక్కరు రెండు గ్రామాలను సందర్శించాలని మంత్రులకు సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజల పరిస్థితిని తెలుసుకుంటూ.. వారికి రేషన్‌, శానిటైజర్లు, మాస్కులు, ఆక్సీమీటర్లు అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 50 వేల రక్తదాన శిబిరాలు నిర్వహించాలని భాజపా యోచిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని