​​​​​​ఆస్పత్రి ఫ్లోర్‌ తుడిచిన మంత్రి
close

తాజా వార్తలు

Published : 15/05/2021 18:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​ఆస్పత్రి ఫ్లోర్‌ తుడిచిన మంత్రి

ఐజ్వాల్‌: అధికార దర్పం పక్కనపెట్టి ఆసుపత్రిలో నేలను తుడిచి ఆశ్చర్యపర్చారు మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌ లాల్జిర్లియానా. అది కూడా కరోనాతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న వేళ. ఆసుపత్రిలో నేల శుభ్రం చేస్తున్న చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

‘ఆసుపత్రిలో నేలను తుడిచి నేను వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. నేనొక ఉదాహరణగా నిలిచి, ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన’ అని ఆ మంత్రి మీడియాతో అన్నారు. తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి పోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు. ‘నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఈ పనులు చేశాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు’ అని ఆయన చెప్పారు. మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని