మా వ్యాక్సిన్‌తో రెండేళ్లపాటు ఇమ్యూనిటీ..!

తాజా వార్తలు

Published : 07/01/2021 19:07 IST

మా వ్యాక్సిన్‌తో రెండేళ్లపాటు ఇమ్యూనిటీ..!

 అంచనా వేసిన మోడెర్నా సీఈఓ

పారిస్‌: ప్రపంచంలో అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చిన రెండో వ్యాక్సిన్‌గా మోడెర్నా నిలిచింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ అమెరికా, బ్రిటన్‌తో పాటు ఈయూలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మోడెర్నా వ్యాక్సిన్‌ రెండేళ్ల పాటు రక్షణ కలిగిస్తుందని సంస్థ సీఈఓ వెల్లడించారు. అయితే, వీటిపై పూర్తిస్థాయి విశ్లేషణ కొనసాగుతోందని తెలిపారు. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ 94.5శాతం సమర్థత చూపించిందని మోడెర్నా ఇదివరకే ప్రకటించింది.

సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్‌ తయారుచేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్‌లను ఒక ఏడాది లోపే అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇలా రూపొందించిన వ్యాక్సిన్‌ల వల్ల ఎంతకాలం పాటు  రక్షణ ఉంటుందనే అంశంపై శాస్త్రవేత్తలు, ఔషధ నియంత్రణ సంస్థల నిపుణుల్లో మెదులుతోన్న ప్రశ్న. ఈ నేపథ్యంలో శీతాకాలం వంటి వాతావరణ పరిస్థితుల్లో కేవలం ఇది రెండు నుంచి మూడు నెలల వరకు మాత్రమే వ్యాక్సిన్‌ పనిచేసే అవకాశం ఉందనే వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మోడెర్నా సంస్థ సీఈఓ స్టీఫేన్‌ బాన్సెల్‌ స్పందించారు. ‘మానవుల్లో వ్యాక్సిన్‌ వల్ల ఉత్పత్తైన యాంటీబాడీలు అత్యంత నెమ్మదిగా క్షీణిస్తాయి. అందుచేత వీటివల్ల దాదాపు రెండేళ్లపాటు రక్షణ ఉంటుందని భావిస్తున్నాం’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఈ మధ్య బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ను మా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని త్వరలోనే నిరూపిస్తామని మోడెర్నా సీఈఓ వెల్లడించారు.

ఇదిలాఉంటే, చైనాలో బయటపడిన కరోనా వైరస్‌కు సంబంధించిన జెనెటిక్‌ సీక్వెన్స్‌ను 2020 జనవరి 11న మోడెర్నా సంస్థ పొందగలిగింది.అనంతరం రెండు నెలల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందించి, క్లినికల్‌ ట్రయల్స్‌కు మార్చి నెలలో ఎఫ్‌డీఏ నుంచి అనుమతి పొందింది. తాజాగా అమెరికా, బ్రిటన్‌, ఈయూతో పాటు మరికొన్ని దేశాల్లో అనుమతులు పొందింది.

ఇవీ చదవండి..
కొవిడ్‌ ఇమ్యూనిటీ: 8నెలల పాటు యాంటీబాడీలు..!
‘మోడెర్నా’ టీకాకు ఎఫ్‌డీఏ ఆమోదం

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని