నాసిక్‌ ఘటన కలచివేసింది: మోదీ

తాజా వార్తలు

Published : 21/04/2021 18:17 IST

నాసిక్‌ ఘటన కలచివేసింది: మోదీ

రూ.5లక్షల పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

దిల్లీ: మహారాష్ట్రలోని ఆస్పత్రిలో ఆక్సిజన్‌ లీకవ్వడంతో 22 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్‌షా ఆవేదన వ్యక్తంచేశారు.ఈ ఘటన తనను కలచివేసిందని ప్రధాని అన్నారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆక్సిజన్‌ లీకేజీ ఘటనపై హోం మంత్రి విచారం వ్యక్తం చేశారు. ‘‘ ఆక్సిజన్‌ లీకేజీ వార్త విని చాలా బాధపడ్డాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’  అంటూ ట్వీట్‌ చేశారు.

నాసిక్‌లోని జాకీర్‌ హుస్సేన్‌ మున్సిపల్‌ ఆస్పత్రి బయట ఆక్సిజన్‌ లీకవ్వడంతో రోగులకు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. మరోవైపు ఇదో భయంకరమైన ఘటన అని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వేరే చోటకి తరలించాలని కోరారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎన్సీపీ నేత ముజీబ్‌ మేమన్‌ డిమాండ్‌ చేశారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని