చిన్నారికి కష్టం.. చలించిన మోదీ!

తాజా వార్తలు

Updated : 11/02/2021 18:19 IST

చిన్నారికి కష్టం.. చలించిన మోదీ!

ఔషధాల దిగుమతిపై రూ.6 కోట్ల మేర సుంకం రద్దు

దిల్లీ: ముంబయిలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల చిన్నారి కష్టానికి ప్రధాని నరేంద్ర మోదీ చలించిపోయారు. చిన్నారి తీరా కామత్ చికిత్సకు అవసరమైన ఔషధాల దిగుమతి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఔషధాల దిగుమతికి సుమారు రూ.6.5 కోట్ల మేర సుంకాన్ని కేంద్రం రద్దు చేసింది. దీనివల్ల ఇంజెక్షన్‌ దిగుమతి, పాప చికిత్సకు మార్గం సుగమమైంది. బాలిక తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫఢణవీస్‌ ఈ నెల 2న ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టింది. స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకొనేందుకు ఎందరో దాతలు విరాళాలు కూడా అందించారు. క్రౌడ్‌ ఫండింగ్ రూపంలో రూ.16కోట్లు మేర తీరా తల్లిదండ్రులు సమీకరించారు. అయితే, ఈ వ్యాధికి ఔషధాలు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నందున వాటి దిగుమతి ఖర్చులు, జీఎస్టీ, ఎక్సైజ్‌ సుంకం కలిపి అదనంగా మరో రూ.6.5 కోట్లు అవసరమయ్యాయి. దీంతో అంత డబ్బు తమ వద్ద లేదని, దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరుతూ పాప తల్లిదండ్రులు కూడా గతంలో ప్రధానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన కేంద్రం చిన్నారి ఔషధాల దిగుమతిపై సుంకాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 

మరోవైపు, అరుదైన జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు పెద్ద మనసుతో సాయం చేసిన ప్రధానికి మహారాష్ట్ర భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వంతో స్పందించి దాదాపు రూ.6.5కోట్ల మేర సుంకాన్ని రద్దు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. తీరా కామత్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదీ చదవండి..

మహారాష్ట్రలో మళ్లీ గవర్నర్ vs సీఎం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని