close

తాజా వార్తలు

Updated : 22/01/2021 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీమ్‌ఇండియా నుంచి స్ఫూర్తి పొందండి: మోదీ

దిల్లీ: సానుకూల మనస్తత్వం సానుకూల ఫలితాలను ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలో భారత్ క్రికెట్ జట్టు సాధించిన చరిత్రాత్మక విజయాన్ని ప్రస్తావిస్తూ.. తక్కువ అనుభవంతో కూడా సవాళ్లపై పోరాడాలని యువతకు సూచించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై దృఢమైన విశ్వాసంతో పోరాడాలంటూ ఈ విజయాన్ని ఉదాహరణగా చూపారు. తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందిన విద్యార్థులనుద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు.

‘‘అనేక సవాళ్ల మధ్య భారత క్రికెట్ జట్టు గబ్బా టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో పోరాడి గెలుపొందింది. జట్టు సభ్యుల అనుభవం తక్కువే అయినా.. వారి ఆత్మవిశ్వాసం అమోఘం. దాంతోనే చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం ఒక జీవిత పాఠం. సానుకూల ఫలితాలను రాబట్టేందుకు సానుకూల మనస్తత్వం ఎంతో అవసరం. ఇదే ఆత్మనిర్భర్ భారత్ సారం’’ అని ప్రధాని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. అలాగే తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఇన్నోవేషన్‌ సెంటర్ కార్యకలాపాలను ప్రశంసించారు.

‘‘ఈ మహమ్మారి ప్రారంభ దశలో ఏం జరుగుతుందోనని ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ దేశం దృఢత్వాన్ని చూపింది. మేడిన్‌ ఇండియా పరిష్కారాలతో కొవిడ్‌తో పోరాడాం’’ అని మోదీ అన్నారు. అలాగే దేశీయంగా తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ కరోనా టీకా గురించి ఆయన మాట్లాడారు. మన శాస్త్రవేత్తలపై నమ్మకం ఫలితమే ఈ టీకాలన్నారు. ‘‘స్వాతంత్ర్యం పొంది 75వ సంవత్సరంలోకి ప్రవేశించనున్నాం. మీరు ఇప్పుడు కొత్త భారతంలో జీవించాలి. ఇప్పటి నుంచి ఇది యువతకు స్వర్ణయుగం’’ అని మోదీ అన్నారు.

ఇవీ చదవండి:

టీకా అనుభవనాలను తెలుసుకోనున్న మోదీ

కొవిడ్ దెబ్బకు..ప్రధాని పదవికి రాజీనామా




Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని