Modi: రేటింగ్ తగ్గినా..ప్రపంచనేతల కంటే ముందే
close

తాజా వార్తలు

Published : 18/06/2021 13:17 IST

Modi: రేటింగ్ తగ్గినా..ప్రపంచనేతల కంటే ముందే

20 పాయింట్లు తగ్గి.. 66శాతానికి రేటింగ్

దిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని 66 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని ప్రపంచ నాయకులపై సర్వేలు నిర్వహించే ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ సంస్థ తెలిపింది. 2019 ఆగస్టులో మోదీని 82శాతం మంది ఆమోదించగా.. ఇప్పుడది సుమారు 20పాయింట్లు తగ్గింది. అయినాసరే, ఇతర ప్రపంచ నాయకులకంటే ప్రజామోదం ఉన్ననేతగా మోదీనే ముందున్నారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’.. పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్‌ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది.

2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఆయన ఆమోద రేటింగ్ 82 శాతంగా ఉందని పేర్కొంది. కేవలం 11 శాతం మంది మాత్రమే ఆయన్ను వ్యతిరేకించారు. ఈ జూన్‌నాటికి ఆ రేటింగ్ 66 శాతానికి పడిపోగా.. 28శాతం మంది నిరాకరించారు. 2,126 మంది వయోజనులపై ఈ సర్వే నిర్వహించారు. అయితే రేటింగ్ పరంగా అమెరికా, యూకే, రష్యా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీతో సహా 13 దేశాల ప్రపంచ స్థాయి నేతల కంటే మోదీనే ముందున్నారని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ రేటింగ్ 53 శాతంగా ఉంది. ఈ 13 దేశాల్లో జపాన్ ప్రధాని యొషిహిడే సుగా రేటింగ్ కేవలం 29 శాతంగా మాత్రమే ఉంది.

భారత్‌ను కరోనా రెండోదశ ఉక్కిరిబిక్కిరి చేసింది. పడకలు, ఆక్సిజన్ కొరతతో వైద్య వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల వైద్యసేవలు అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క టీకా కార్యక్రమంలో కూడా ఆశించిన వేగం కనిపించలేదు. ఇవన్నీ మోదీ ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలపాలు చేశాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని