Modi: నా మిత్రుడిని ఎంతగానో మిస్‌ అవుతున్నా..

తాజా వార్తలు

Updated : 05/07/2021 11:56 IST

Modi: నా మిత్రుడిని ఎంతగానో మిస్‌ అవుతున్నా..

దిల్లీ: దివంగత నేత, మిత్రుడు రామ్ విలాస్ పాసవాన్‌ను గుర్తుచేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సోమవారం పాసవాన్‌ జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘ఈ రోజు నా స్నేహితుడు, దివంగత రామ్‌ విలాస్ పాసవాన్ జయంతి. నేను ఆయన సహచర్యాన్ని ఎంతగానో కోల్పోతున్నాను. దేశంలోనే అపారమైన అనుభవాన్ని గడించిన పార్లమెంట్ సభ్యుడాయన. అణగారిన వర్గాల సాధికారతకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం’ అని మోదీ కొనియాడారు. 

కేంద్రమంత్రిగా సేవలు అందిస్తూనే.. గత ఏడాది అక్టోబర్‌లో అనారోగ్యంతో పాసవాన్ కన్నుమూశారు. 2000 సంవత్సరంలో ఆయన లోక్‌జనశక్తి(ఎల్‌జేపీ) పార్టీని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్‌ ఆ పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. ఇటీవల చిరాగ్ చిన్నాన్న నేతృత్వంలో ఎల్‌జేపీలో చీలిక ఏర్పడింది. ఈ వ్యవహారంలో భాజపా నుంచి మద్దతు లభించకపోవడంపై చిరాగ్‌ నిరాశ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని