కొవిడ్ దెబ్బకు..ప్రధాని పదవికి రాజీనామా
close

తాజా వార్తలు

Published : 22/01/2021 01:51 IST

కొవిడ్ దెబ్బకు..ప్రధాని పదవికి రాజీనామా

ఉలాన్‌ బాతార్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విశ్వరూపం చూపిస్తోంది. కొవిడ్ మహమ్మారి కట్టడిలో విఫలమవడంతో ఓ దేశ ప్రధాని ఏకంగా తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది. మంగోలియా ప్రధాని ఖురేసుఖ్ ఉఖ్నాకు ఈ క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఆయన గురువారం పార్లమెంట్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆ దేశ మీడియా సంస్థ వెల్లడించింది. 

కొవిడ్ రోగి, ఆమె నవజాత శిశువుకు పునరావాసం కల్పించడంలో మంగోలియా ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని విమర్శలు వచ్చాయి. దాంతో దేశ రాజధాని నగరం ఉలాన్‌ బాతార్‌ బుధవారం తీవ్ర స్థాయి నిరసనలతో అట్టుడికిపోయిందని మీడియా సంస్థ వెల్లడించింది. దాంతో తప్పని పరిస్థితుల్లో ప్రధాని రాజీనామాను సమర్పించాల్సి వచ్చిందని పేర్కొంది. 

కరోనా ప్రారంభ దశలో వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేసి, మంగోలియా ప్రభుత్వం ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఇటీవల కాలంలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి రష్యా నుంచి దేశంలోకి ప్రవేశించాడు. దాంతో దేశంలో వైరస్ విజృంభణ ప్రారంభమైంది. ఇప్పుడు దాని కట్టడికి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. 

 

ఇవీ చదవండి:

టీకా వేయించుకోనున్న ప్రధాని మోదీ!

సీరం సంస్థలో భారీ అగ్నిప్రమాదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని