E-Shram Portal: ‘ఈ- శ్రమ్‌’ పోర్టల్‌కు విశేష స్పందన.. 4 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు

తాజా వార్తలు

Published : 18/10/2021 01:24 IST

E-Shram Portal: ‘ఈ- శ్రమ్‌’ పోర్టల్‌కు విశేష స్పందన.. 4 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు

దిల్లీ: అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉపాధి పథకాలను చేరువ చేసేందుకు కేంద్రం ఇటీవల ప్రారంభించిన ‘ఈ- శ్రమ్‌’ వెబ్‌ పోర్టల్‌కు విశేష స్పందన వస్తోంది. ఇందులో ఇప్పటివరకు దాదాపు నాలుగు కోట్లకు పైగా కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు వస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయం, నిర్మాణ రంగాల నుంచి అత్యధిక సంఖ్యలో కార్మికులు నమోదయ్యారని తెలిపింది. మాన్యుఫ్యాక్చరింగ్‌, ఇంటి పనులు, వీధి విక్రయాలు, రవాణా తదితర రంగాలకు చెందిన కార్మికుల నుంచి భారీఎత్తున స్పందన వస్తోందని, వలస కార్మికులూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నారని వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో దాదాపు 50 శాతం మహిళలు ఉండటం విశేషమని పేర్కొంది.

దేశవ్యాప్తంగా చెల్లుబాటు..

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ సైతం ఆదివారం ఈ మేరకు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ పోర్టల్‌లో నమోదయితే.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందొచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగాల కార్మికులను ఒకచోట నమోదు చేయాలనే లక్ష్యంతో కార్మిక మంత్రిత్వ శాఖ రెండు నెలల క్రితం ఈ పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో వివరాలు నమోదు చేసుకున్న తర్వాత.. డిజిటల్ ఈ-శ్రమ్ కార్డు ఇస్తారు. దీనిద్వారా సంబంధిత కార్మికులు తమ వివరాలను పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ- శ్రమ్‌ కార్డుపై కలిగి ఉన్న ప్రత్యేక ఖాతా సంఖ్య.. దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. దీంతో వేరే ఇతర రాష్ట్రాల్లోనూ కార్మికులు సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పోర్టల్‌లో నమోదైన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యంపై రూ.లక్ష బీమా వర్తిస్తుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని