close

తాజా వార్తలు

Published : 02/03/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వందే భారత్ మిషన్: 60లక్షల మంది వెనక్కి

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘వందేభారత్ మిషన్’ కింద విదేశాల్లో చిక్కుకుపోయిన 60లక్షల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ మిషన్‌కి సంబంధించి ఎనిమిదో దశ కొనసాగుతోంది. ఈ వివరాలను పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

‘2020, మే 6న 64 విమానాలు, 12,800 మంది ప్రయాణికులతో ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమైంది. నాటి నుంచి 60 లక్షల మందిని స్వదేశానికి తీసుకువచ్చాం. అంతర్జాతీయ ప్రయాణాలన్ని సులభతరం చేశాం. ప్రస్తుతం ఎనిమిదో దశలో ఉన్న ఈ మిషన్ కొనసాగుతోంది’ అని ట్వీట్‌లో వివరించారు. 

కాగా, భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య విమనాల సర్వీసులపై కేంద్రం మార్చి 31 వరకు ఆంక్షలను పొడిగించింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దాంతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు గత మే నుంచి వందే భారత్ మిషన్ కింద కేంద్రం విమానాలను తిప్పుతోంది. అలాగే జులై నుంచి ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న దేశాలతో రాకపోకలకు అనుమతులు ఇచ్చింది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని