నెగటివ్‌ వస్తేనే భారత్‌-నేపాల్‌కు అనుమతి

తాజా వార్తలు

Published : 04/01/2021 23:30 IST

నెగటివ్‌ వస్తేనే భారత్‌-నేపాల్‌కు అనుమతి

పిథోర్‌గఢ్‌: కొవిడ్ స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. భారత్‌-నేపాల్‌ మధ్య కాళీ నదిపై ఉన్న 5 వంతెల ద్వారా రాకపోకలను కఠినతరం చేసింది. కరోనా పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వారికే వంతెన ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కరోనా నెగటివ్‌ వచ్చిన నేపాలీ ప్రజలనే భారత్‌ భూభాగంలోకి అనుమతిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. భారత్‌ నుంచి నేపాల్‌కు వెళ్లాలనుకున్నవారికీ ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు.

భారత్‌-నేపాల్‌ మధ్య రాకపోకలకు సంబంధించిన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి తెచ్చినట్లు పిథోర్‌గఢ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ జోగ్‌దండే వెల్లడించారు. బ్రిటన్‌తోపాటు భారత్‌లోనూ స్ట్రెయిన్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తాజా నిబంధనల ప్రకారం ఎవరైనా నేపాల్‌ పౌరులు భారత్‌లోకి రావాలనుకుంటే క్రాసింగ్‌ వంతెనపై కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అందులో నెగటివ్‌ వచ్చిన వారికే సరిహద్దులు దాటే అవకాశముంటుంది. పిథోర్‌గఢ్‌ జిల్లా పరిధిలో భారత్‌-నేపాల్‌ మధ్య ఉన్న 5 వంతెన మార్గాల్లోనూ ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.

ఇదీ చదవండి

ఏడోసారీ కొలిక్కిరాని చర్చలు..మళ్లీ 9న!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని