ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌.. మొన్న బాస్కెట్‌బాల్‌.. నేడు డ్యాన్స్‌

తాజా వార్తలు

Published : 09/07/2021 22:49 IST

ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌.. మొన్న బాస్కెట్‌బాల్‌.. నేడు డ్యాన్స్‌

భోపాల్‌: మొన్నటికి మొన్న క్రీడాకారిణిగా మారి బాస్కెట్‌బాల్‌ ఆడిన భాజపా ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌.. తాజాగా డ్యాన్స్‌ చేసి మరోసారి ఆశ్చర్యపర్చారు. తన నివాసంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మహిళలతో కలిసి ఎంపీ కూడా స్టెప్పులేశారు.

పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతుల పెళ్లికి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ఆర్థిక సాయం చేశారు. అంతేగాక, భోపాల్‌లోని తన నివాసంలోనే దగ్గరుండి పెళ్లి వేడుక జరిపించారు. ఈ వేడుకలో ఎంపీ డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

అయితే దీనిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. సాధారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ చక్రాల కుర్చీలోనే కన్పించే ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ఈ మధ్య బాస్కెట్‌బాల్‌ ఆడిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. ఇటీవల భోపాల్‌లోని సాకేత్‌ నగర్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ బాస్కెట్‌బాల్‌ గ్రౌండ్‌లో కొందరు ఆడుతూ కన్పించడంతో ఆమె అక్కడకు వెళ్లారు. బంతిని తీసుకుని ఆడుకుంటూ వెళ్లి నెట్‌లోకి విసిరారు. అది సరాసరి బాస్కెట్‌లో పడటంతో అక్కడున్నవారంతా ఎంపీని చప్పట్లతో అభినందించారు. ఇప్పుడు డ్యాన్స్‌ చేస్తూ కన్పించారు.

కాగా.. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ఈమె.. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేనని, తనకు మినహాయింపు ఇవ్వాలని పలుమార్లు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో తాజా వీడియోలు వైరల్‌ అవడంతో ఆమెపై ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని