DeltaPlus: నెల రోజుల కిందటే డెల్టాప్లస్‌తో మరణం..!
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 13:58 IST

DeltaPlus: నెల రోజుల కిందటే డెల్టాప్లస్‌తో మరణం..!

మధ్య ప్రదేశ్‌లో ధ్రువీకరించిన నిపుణులు

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి అదుపులోకి వస్తున్న సమయంలో ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఈ రకం కేసులు వెలుగుచూస్తుండగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లో నెల రోజుల క్రితం ఓ మహిళ మరణానికి ‘డెల్టా ప్లస్‌’ కారణంగా తేలింది. ఈ వేరియంట్‌లో ధ్రువీకరించిన తొలి మరణం ఇదే. 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్‌ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. ఆమె రక్తనమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా.. ఆమెకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిన ఐదు కేసులు బయటపడ్డాయి. భోపాల్‌లో మూడు, ఉజ్జయినిలో రెండు కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు వైరస్‌ నుంచి కోలుకోగా.. ఒకరు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రకం సోకిన వారిని గుర్తించి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టారు. 

ఇప్పటివరకు దేశంలో 40కి పైగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ నిన్న వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 21 కేసులు బయటపడగా.. మధ్యప్రదేశ్‌, కేరళ, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాలకు ఈ వైరస్‌పాకింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. డెల్టాప్లస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అడ్వయిజరీ జారీ చేసింది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళనకర రకంగా పేర్కొన్న విషయం తెలిసిందే. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని