Hepatitis: కరోనాతో చిన్నారుల్లో కాలేయవాపు!

తాజా వార్తలు

Published : 11/08/2021 01:52 IST

Hepatitis: కరోనాతో చిన్నారుల్లో కాలేయవాపు!

దిల్లీ: కరోనా వైరస్ కొందరు చిన్నారుల అవయవాలపై ప్రభావం చూపుతోంది. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో పిల్లల్లో ఉన్నట్టుండి కాలేయవాపు లక్షణాలు బయటపడినట్లు తేలింది. కరోనా వైరస్‌ చిన్నారులను కాలేయవాపు(హెపటైటిస్‌)కు గురిచేస్తున్నట్లు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) అధ్యయనం వెల్లడించింది. కొందరు చిన్నారుల గుండె, రక్తనాళాలు, కళ్లు, చర్మం వంటి అవయవాలను కొవిడ్‌ ప్రభావితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రభావాన్నే మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌(మిస్సీ)గా  పేర్కొంటున్నాం.

కరోనా రెండో దశలో కొవిడ్‌ విజృంభించిన సమయంలో  పిల్లలను పరిశీలించగా వారిలో ఉన్నట్టుండి కాలేయవాపు లక్షణాలు బయటపడినట్లు అధ్యయనం తెలిపింది. మూడు నుంచి ఆరు వారాల వరకు కొవిడ్‌ బారినపడ్డ కొందరు పిల్లల్లో.. కుటుంబంలో ఎవరికీ కాలేయ జబ్బులు లేకపోయినా హెపటైటిస్‌ లక్షణాలు కనిపించాయి. కానీ చాలామందిలో కొవిడ్‌ లక్షణాలేవీ లేకపోవటం గమనార్హం. కొందరు చిన్నారుల్లో మిస్సీ తరహా లక్షణాలు బయటపడ్డాయి. డెల్టా తరహా వైరస్‌ రకాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో పిల్లల్లో కాలేయవాపు లక్షణాలపై ఓ కన్నేసి ఉంచటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని