close

తాజా వార్తలు

Published : 26/02/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా.. ముంబయి పోలీసుల విభిన్న ట్వీట్‌.. !

ముంబయి: మహారాష్ట్రలో  కొవిడ్ వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు నగరాల్లో వైరస్‌ ఉద్ధృతి క్రమక్రమంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని విదర్భ ప్రాంతంలో తీవ్రరూపం దాల్చుతోన్న మహమ్మారి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే  ప్రజలు కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటించడానికి  ముంబయి పోలీసులు విభిన్న రీతిలో సూచనలు ఇస్తున్నారు. ఈ మేరకు వారు ట్విటర్‌ వేదికగా పలు పోస్టులు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కఠినమైన నియమాలను ప్రజలు పాటించడానికి హాస్యంతో కూడిన పోస్టులు చేస్తూ పోలీసు అధికారులు బుధవారం ట్వీట్‌ చేశారు.‘ప్రియమైన ముంబయి వాసులు, తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించండి. లేకుంటే మేం మిమ్మల్ని వెంబడించాల్సి ఉంటుంది. అది మీకు అంత మంచిది కాదు’అని పోలీసు అధికారులు ట్వీటర్‌లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా పెరిగిపోతున్న కరోనా కేసుల గురించి వివరిస్తూ ట్విటర్‌లో కొన్ని ఉదాహరణ చిత్రాలను కూడా పోస్టు చేశారు. కరోనా ప్రొటోకాల్స్‌ పాటించనివారు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ ధరించనివారికి రూ. 1000 జరిమానా విధించడంతో పాటు  అదనంగా వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.  ఈ క్రమంలో మాస్క్‌లు ధరించకుండా జింఖానా క్రీడా మైదానంలో తిరిగిన 300 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 
కొవిడ్‌-19  వైరస్‌ మహారాష్ట్రలో అత్యధిక ప్రభావం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 8 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా,  మహమ్మారి కారణంగా నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 80 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నమోదయిన మొత్తం కేసుల్లో మహరాష్ట్రలోనే సగం నమోదయినట్లు అధికారులు గణాంకాలు వెల్లడించారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,21,119కి చేరింది. గత నాలుగు నెలల నుంచి చూసుకుంటే.. నిన్న ఒక్కరోజే ముంబయిలో రికార్డు స్థాయిలో 1,167  కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. నగర పౌర అధికారులు సోమవారం కొత్తగా కరోనా మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే..  అందరూ మాస్క్‌లు ధరించి, కొవిడ్‌ నియమాలు పాటించాలి. లేకుంటే లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి నెలకొంటుంది. లాక్‌డౌన్‌ విధించే విషయంపై ఆలోచిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని