Positivity Rate: ముంబయిలో 5% దిగువకు..

తాజా వార్తలు

Published : 26/05/2021 01:21 IST

Positivity Rate: ముంబయిలో 5% దిగువకు..

ముంబయి: కరోనా మొదటి దశ నుంచే అధిక కేసులు నమోదువుతూ నిత్యం వార్తల్లో నిలిచిన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీగానే కేసులు నమోదవుతున్నా.. ముంబయిలో మాత్రం గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 21 వేల శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,037 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కాగా పాజిటివిటీ రేటు 4.94 శాతానికి తగ్గడం విశేషం. పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉంటే సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 

ముంబయిలో మరణాలు కూడా భారీగా తగ్గాయి. కొత్తగా 37 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. గత ఏప్రిల్‌ 9 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. కట్టుదిట్టమైన నిబంధనలతో కరోనాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా.. మహారాష్ట్రలోని పట్టణాలు, గ్రామాల్లో మాత్రం భారీగానే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,136 కేసులు నమోదయ్యాయి. 601మంది మృతిచెందారు. మహారాష్ట్రలో ఇంకా 3.14 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని