తనకు తాను ప్రధానిగా ప్రకటించుకున్న మయన్మార్‌ ఆర్మీ చీఫ్‌

తాజా వార్తలు

Updated : 02/08/2021 13:50 IST

తనకు తాను ప్రధానిగా ప్రకటించుకున్న మయన్మార్‌ ఆర్మీ చీఫ్‌

మయన్మార్‌: మయన్మార్‌ ఆర్మీ చీఫ్‌ యంగ్‌ మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌ తనకు తాను దేశ ప్రధానినని ప్రకటించుకున్నారు. గత కొద్ది నెలలుగా ఆ దేశం రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటుండగా.. ‘మయన్మార్‌ సంరక్షక ప్రభుత్వం’ పేరుతో స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ ప్రధానిగా ఆగస్టు 1న హ్లయింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023లో దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. భవిష్యత్‌లో ఆసియన్‌ నియమించే ప్రాంతీయ రాయబారితో కలిసి పనిచేయడానికి తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఫిబ్రవరి 1న మిలటరీ పాలనా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటినుంచి హ్లయింగ్‌ ఆ దేశ అధికారాలను తన చేతుల్లోకి తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని