Black Fungus: బ్లాక్‌ ఫంగస్ సవాలు విసురుతోంది

తాజా వార్తలు

Updated : 21/05/2021 14:09 IST

Black Fungus: బ్లాక్‌ ఫంగస్ సవాలు విసురుతోంది

కరోనా నుంచి చిన్నారులను రక్షించుకోవాలి: ప్రధాని

దిల్లీ: ఈ కరోనా కల్లోల సమయంలో బ్లాక్‌ ఫంగస్ సవాలు విసురుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యసిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.

‘కరోనా వైరస్ మన ఆత్మీయులను దూరం చేసింది. ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రెండోదశలో ఒకే సమయంలో బహుముఖ పోరాటం చేయాల్సి వస్తోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బాధితులు ఎక్కువ సమయం ఆసుపత్రుల్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో యోగా మంచి ఫలితాన్నిచ్చిందన్నారు. అయితే వైరస్‌పై మనం చేయాల్సిన పోరాటం ఎంతో ఉందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడుతున్న కరోనాపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘ఎక్కడ అనారోగ్యం ఉందో..అక్కడ చికిత్స ఉండాలి. మనం ప్రజల్ని ఎంత క్షేమంగా చూసుకుంటే..వైద్య వ్యవస్థపై అంత తక్కువ ఒత్తిడి పడుతుంది. అలాగే కొవిడ్‌ 19 నుంచి చిన్నారులను రక్షించాల్సి ఉంది. గతంలో పిల్లలపై ప్రభావం చూపిన పలు వ్యాధులపై మనం విజయం సాధించాం. చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా సాధ్యమైన ఉత్తమ పద్ధతులను వాడండి’ అని వైద్యులను ప్రోత్సహించారు.

‘ఇటీవలి కాలంలో బ్లాక్‌ ఫంగస్ కొత్త సవాలు విసురుతోంది. దాని కట్టడికి వీలుగా వ్యవస్థను సిద్ధం చేయాలి’ అని సూచించారు. దేశవ్యాప్తంగా నిత్యం రెండు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. సుమారు నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ..బ్లాక్ ఫంగస్ ఇప్పుడు సవాలు విసురుతోంది. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో బయటపడుతున్న బ్లాక్‌ ఫంగస్ కొత్త కలవరానికి కారణమవుతోంది. పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్ కేసులు వెలుగుచూస్తోన్న నేపథ్యంలో దాన్ని అంటువ్యాధిగా ప్రకటించాలని కేంద్రం గురువారం రాష్ట్రాలను ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని