NASA Mars Rover: అంగారకుడిపై జీవాన్వేషణలో కీలక ఘట్టం పూర్తి.. కానీ,

తాజా వార్తలు

Published : 07/08/2021 11:53 IST

NASA Mars Rover: అంగారకుడిపై జీవాన్వేషణలో కీలక ఘట్టం పూర్తి.. కానీ,

వాషింగ్టన్‌: జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్‌సివరెన్స్‌ రోవర్‌ శోధన కొనసాగుతుంది. మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్‌ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్‌లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్లుగానే గుంత చేసిన రోవర్‌.. రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఇలా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనుకున్నట్లుగానే అన్ని పరికరాలు సక్రమంగా పనిచేశాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

అయితే, నమూనాలు మాత్రం నిర్దేశిత టైటానియం గొట్టాల్లోకి రాలేదని పరిశోధకులు తెలిపారు. దీనికి పరికరాల పనితీరులో లోపం కారణం కాకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ పురాతన రాయి తాము అనుకున్నట్లుగా స్పందించి ఉండకపోవడమే కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై రానున్న కొన్ని రోజుల పాటు విశ్లేషణ జరుగుతుందని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి సందర్భం ఎదురైందని గుర్తుచేశారు. 2008 ఫీనిక్స్ మిషన్‌లోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలిపారు. అప్పుడు మట్టి నమూనాలు సేకరించినప్పటికీ.. అవి జిగురుగా ఉండడంతో అనుకున్నట్లుగా వాటిని పరీక్షించేందుకు ఆయా పరికరాలపైకి కదిలించలేకపోయామన్నారు. కానీ, అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు విజయం సాధించామన్నారు. ఈసారి కూడా తదుపరి ప్రయత్నాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు మిషన్‌లో భాగంగా పంపిన ఇంజెన్యుటీ హెలికాప్టర్‌ సైతం తన విధుల్ని సక్రమంగా పూర్తి చేస్తున్నట్లు నాసా తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్ని జల్లెడ పట్టిన ఈ హెలికాప్టర్‌ అనేక చిత్రాలను నాసాకు పంపింది. వీటిని పరిశీలిస్తున్న బృందం.. పరిశోధనాసక్తి గల ప్రాంతాల్ని గుర్తించి రోవర్‌ను అక్కడికి పంపేందుకు ప్రయత్నిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని