close

తాజా వార్తలు

Published : 23/02/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేషనల్‌ హెరాల్డ్ కేసు విచారణపై స్టే

స్పందన తెలియజేయాలని సోనియా, రాహుల్‌కు కోర్టు ఆదేశం

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్ కేసులో ట్రయల్‌ కోర్టు విచారణపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఈ కేసు విచారణను జాప్యం చేసేందుకు సుబ్రహ్మణ్యస్వామి ప్రయత్నిస్తున్నారని సోనియా, రాహుల్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు.



ఇవీ చదవండి


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని