vaccine: రాష్ట్రాల వద్ద 3కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు
close

తాజా వార్తలు

Published : 21/06/2021 01:17 IST

vaccine: రాష్ట్రాల వద్ద 3కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు అన్ని రాష్ట్రాలూ కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద 3.06 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. వచ్చే మూడురోజుల్లో మరో 24.53లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను అందించనున్నట్లు వెల్లడించింది.

ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు 29.10కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఉచితంగా కేంద్రం అందించింది. కాగా, వీటిలో 26.04కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను(వృథాతో కలిపి) ప్రజలకు అందించారు. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తయారీ సంస్థల నుంచి కేంద్రం వ్యాక్సిన్‌ కొనుగోలు చేసి, రాష్ట్రాలకు అందిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని