కొవాగ్జిన్‌ టీకాలో మార్పులు అవసరం లేదు!

తాజా వార్తలు

Published : 19/03/2021 19:59 IST

కొవాగ్జిన్‌ టీకాలో మార్పులు అవసరం లేదు!

వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: దేశంలో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌ టీకాకు ఎటువంటి మార్పులూ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే వెలుగుచూసిన కొత్తరకం వైరస్‌లపైనా ఈ టీకా సమర్థంగా పనిచేస్తున్నందున ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తున్నట్లు కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. దేశంలో కొత్తరకం వైరస్‌లు వెలుగుచూస్తున్న వేళ.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టీకాల్లో మార్పులు అవసరమా? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది.

దేశంలో ఇప్పటివరకు నాలుగు కొత్తరకం కరోనా వైరస్‌లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో బ్రిటన్‌వి రెండు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలు ఒకటి చొప్పున కనుగొన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని చౌబే తెలిపారు. భారత్‌లో వెలుగుచూసిన బ్రిటన్‌, బ్రెజిల్‌ స్ట్రెయిన్‌లపై కొవాగ్జిన్‌ సమర్థంగానే పనిచేస్తున్నట్లు తేలిందని.. దక్షిణాఫ్రికా రకంపై ఈ టీకా ప్రభావశీలతపై ప్రస్తుతం విశ్లేషణ జరుగుతోందని చెప్పారు. ఇక బ్రిటన్‌ రకంపై ఆస్ట్రాజెనెకా టీకా 74.6శాతం సమర్థత కనబరిచిందని, బ్రెజిల్‌ రకంపైనా టీకా సమర్థగా ఉన్నట్లు తెలిసిందన్నారు. కానీ, దక్షిణాఫ్రికా రకంపై ఆస్ట్రాజెనెకా టీకా కేవలం పదిశాతం మాత్రమే సమర్థత చూపించిందని, దీంతో టీకా మార్పులపై ఆ సంస్థ దృష్టి సారించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 93లక్షల కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 20లక్షల కరోనా టీకా డోసులను అందిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని