Varun Gandhi: ధాన్యానికి నిప్పుపెట్టిన రైతు.. వరుణ్‌ గాంధీ కీలక వ్యాఖ్య

తాజా వార్తలు

Published : 24/10/2021 01:27 IST

Varun Gandhi: ధాన్యానికి నిప్పుపెట్టిన రైతు.. వరుణ్‌ గాంధీ కీలక వ్యాఖ్య

దిల్లీ: కొత్త సాగు చట్టాలు.. ఇటీవల లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటన.. ఇలా రైతు సంబంధిత అంశాలపై తరచూ స్పందిస్తూ వస్తున్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ తాజాగా దేశ వ్యవసాయ విధానాలపై కీలక వ్యాఖ్య చేశారు. వాటి విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. లఖింపుర్‌లో ఓ రైతు.. ధాన్యానికి నిప్పు పెడుతున్న దృశ్యాలను పోస్ట్‌ చేస్తూ.. ఈ వ్యాఖ్యను జోడించారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రైతు తాను పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు 15 రోజులుగా వ్యవసాయ మార్కెట్‌లకు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ.. ఫలితం లేకపోవడంతో ఆశలన్నీ వదిలేసుకుని స్వయంగా దానికి నిప్పు పెట్టారు. ఈ వ్యవస్థ.. రైతులను ఎక్కడికి తీసుకువెళుతోంది? వ్యవసాయ విధానాలపై పునరాలోచించడం ఇప్పుడు అన్నిటికంటే పెద్ద అవసరం’ అని రాసుకొచ్చారు.

ఇప్పటికే ఆయా సందర్భాల్లో రైతులకు మద్దతు పలికి తన పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో వరుణ్‌ గాంధీ చోటు కోల్పోయిన విషయం తెలిసిందే! ఇదేం పట్టించుకోకుండా ఇటీవల రైతులకు అండగా నిలిచిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి చెందిన వీడియోను షేర్ చేశారు. శుక్రవారం సైతం ఆయన యూపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెరాయ్ ప్రాంతంలో వరదల ఫొటోలను ట్వీట్ చేస్తూ.. సహాయక చర్యల్లో ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని