ఆలయంలో ముద్దు సన్నివేశాల చిత్రీకరణ!

తాజా వార్తలు

Published : 23/11/2020 12:51 IST

ఆలయంలో ముద్దు సన్నివేశాల చిత్రీకరణ!

నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌పై విచారణకు ఆదేశం

భోపాల్‌: ఓటీటీ మాధ్యమం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారమయ్యే ‘ఎ సూటబుల్‌ బోయ్‌’ సిరీస్‌పై మధ్యప్రదేశ్‌లో వివాదం రేగింది. ఇందులో ఉన్న ముద్దు సన్నివేశాలను మహేశ్వర్‌ పట్టణంలోని ప్రముఖ ఆలయంలో చిత్రీకరించారని భాజపా అనుబంధ విభాగం భారతీయ జనతా యువ మెర్చా(బీజేవైఎం) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా ఆ సన్నివేశంలో గుడిలో భజనలు వినిపించి భక్తుల మనోభావాలను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆదివారం విచారణకు ఆదేశించారు. ముద్దు సన్నివేశాలు ఆలయంలోనే చిత్రీకరించినట్టు తేలితే సిరీస్‌ నిర్మాత, దర్శకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ క్షమాపణ చెప్పడంతో పాటు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని బీజేవైఎం డిమాండ్‌ చేసింది. వివాదాస్పదమైన ‘ఎ సూటబుల్‌ బోయ్‌’లో  ఆలయం వేదికగా యువ జంట ప్రేమించుకున్నట్టు చూపించారు. ఈ సిరీస్‌ మీరా నాయర్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. సలాం బోంబే, మాన్‌సూన్‌ వెడ్డింగ్, నేమ్‌సేక్‌ వంటి విమర్శకుల ప్రసంసలు అందుకున్న చిత్రాలకు ఈమె దర్శకురాలు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని