WhatsApp: కొత్త పాలసీ విధానం వాయిదా వేయలేం!
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 15:55 IST

WhatsApp: కొత్త పాలసీ విధానం వాయిదా వేయలేం!

దిల్లీ హైకోర్టుకు వెల్లడించిన సంస్థ

దిల్లీ:  కొత్త గోప్యతా విధానాన్ని వాయిదా వేయడం కుదరదని వాట్సాప్ సోమవారం స్పష్టం చేసింది. యూజర్లు ఈ విధానాన్ని అంగీకరించకపోతే.. నెమ్మదిగా వారి ఖాతాలు తొలగిస్తామని తెలిపింది. వాట్సాప్‌ తరఫున కపిల్‌ సిబల్ దిల్లీ హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించారు. ‘ఈ కొత్త విధానాన్ని అంగీకరించమని మేం యూజర్లను కోరాం. వారు అంగీకరించకపోతే మేం వారి ఖాతాలను తొలగిస్తాం. ఈ విధానాన్ని వాయిదా వేయడం లేదు’ అని సిబల్ కోర్టుకు వెల్లడించారు. 

అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్‌ శర్మ వాదనలు వినిపిస్తూ..ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయని చెప్పారు. అలాగే దీనిపై కేంద్రం సంస్థ ఉన్నతాధికారులకు లేఖ రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లు యాప్‌ను వాడేందుకు అనుమతించట్లేదంటూ వినిపించిన వాదనలను వాట్సాప్ తోసిపుచ్చింది. మా విధానం ఐటీ నిబంధనలను ఉల్లంఘించట్లేదని స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్‌ శర్మ, పిటిషనర్లు కోరగా.. హైకోర్టు నిరాకరరించి... విచారణను జూన్ 3 కి వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని