New Taliban govt policy: పాత తాలిబన్లలానే పనిచేస్తాం.. సమస్యలు తీరుస్తాం..!

తాజా వార్తలు

Updated : 08/09/2021 14:51 IST

New Taliban govt policy: పాత తాలిబన్లలానే పనిచేస్తాం.. సమస్యలు తీరుస్తాం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ను షరియా చట్టానికి అనుగుణంగా పరిపాలిస్తామని తాలిబన్లు తేల్చి చెప్పారు. నిన్న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు పరిపాలనా విధానంపై కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన తాలిబన్‌ సుప్రీం లీడర్‌ మౌల్వీ హిబైతుల్లా అఖుంద్‌జాదా పేరుతో వెలువడింది.

‘‘ఎవరూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దు. అన్ని సమస్యలను సరైన మార్గంలో పరిష్కరిస్తాం. గత 20 ఏళ్లుగా రెండు లక్ష్యాలతోనే మేము పనిచేశాం. అఫ్గాన్‌ గడ్డపై నుంచి విదేశీ సేనలను పంపించి వేయడం ఒకటి కాగా.. దేశంలో పూర్తి స్థాయి సుస్థిర ఇస్లామిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం రెండోది. దీని ఆధారంగా భవిష్యత్తులో దేశ పాలన, అఫ్గాన్ల జీవితాలను ఇస్లామిక్‌ చట్టమైన షరియాను అనుసరించి క్రమబద్ధీకరిస్తాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

‘‘భవిష్యత్తులో అఫ్గాన్లు తాలిబన్లకు మద్దతు ఇచ్చి వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ప్రతిభావంతులైన విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు,ఇంజినీర్లు, వ్యాపార వేత్తలు, పెట్టుబడిదార్లకు ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ చాలా విలువనిస్తుంది. దేశానికి వారి మార్గదర్శకత్వం, సేవలు చాలా అవసరం. ప్రజలు దేశం విడిచి వెళ్లవద్దు. ఎవరితోనూ మాకు సమస్యలు లేవు’’ అని తాలిబన్లు పేర్కొన్నారు.

ముల్లాలకు పీహెచ్‌డీలు ఉన్నాయా.. వారు పాలించడంలేదా..

తాలిబన్ల పాలనలో పీహెచ్‌డీలు, ఎంఏలకు విలువ లేదని తెలిపారు. ఈ విషయాన్ని తాలిబన్‌ విద్యాశాఖ మంత్రి షేక్‌ మౌల్వీ నూరుల్లా మునీర్‌ చెప్పారు. ‘‘ఈ రోజు పీహెచ్‌డీలకు ఎంఏలకు విలువ లేదు. మీరు చూడండి.. అధికారంలో ఉన్న ముల్లాలు, తాలిబన్లకు పీహెచ్‌డీ,ఎంఏ డిగ్రీలు ఉన్నాయా..? వారికి కనీసం హైస్కూల్‌ విద్య కూడా లేదు. కానీ, వారే అందరికంటే గొప్పగా ఉన్నారు’’ అని తెలిపారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని