ఫ్రాన్స్‌కు పాకిన కొత్తరకం కరోనా!

తాజా వార్తలు

Published : 26/12/2020 09:34 IST

ఫ్రాన్స్‌కు పాకిన కొత్తరకం కరోనా!

ప్యారిస్‌: కరోనా కొత్త రకం తాజాగా ఫ్రాన్స్‌కు పాకింది. శుక్రవారం అక్కడ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. బాధితుడు డిసెంబరు 19న బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చినట్లు తెలిపారు. డిసెంబరు 21న పరీక్షలు జరపగా.. పాజిటివ్‌ అని తేలడంతో నిర్బంధంలో ఉంచారు. తదుపరి పరీక్షలు చేయగా.. అది కొత్త రకం వైరస్‌ అని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇటీవల బాధితుడు కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. బ్రిటన్‌లో వైరస్ వెలుగులోకి రాగానే అప్రమత్తమైన ఫ్రాన్స్‌ అక్కడి నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. కానీ, సొంత దేశం వారు తిరిగొచ్చేందుకు వీలుగా కొంత వెసులుబాటు కల్పించింది. అలాగే సరకుల రవాణాకు సైతం పచ్చజెండా ఊపింది. కానీ, కరోనా నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేసింది.

దక్షిణాఫ్రికాలో ఉత్పరివర్తనానికి గురైన ఈ కొత్త వైరస్‌ అక్కడి నుంచి ఓ ప్రయాణికుడి ద్వారా బ్రిటన్‌కు చేరింది. అక్కడ భారీ స్థాయిలో కేసులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మళ్లీ నిషేదాజ్ఞలు విధించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇక ఇటలీలోనూ ఓ వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించారు. డెన్మార్క్‌లోనూ ఏడుగురికి కొత్త రకం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అలాగే నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియాలోనూ ఒక్కో కేసు నమోదైంది.

ఇవీ చదవండి..

యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులు

బ్రిటన్‌ ప్రయాణికుల్లో 16 మందికి కొవిడ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని