‘మరోసారి ఆ తప్పు జరగదు’

తాజా వార్తలు

Published : 19/02/2021 01:16 IST

‘మరోసారి ఆ తప్పు జరగదు’

మలాలాకు తాలిబన్ల బెదిరింపులు

లండన్‌: 2012లో నోబెల్‌ శాంతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనకు బాధ్యుడైన ఉగ్రవాది ఇషానుల్లా ఎహ్సాన్‌ మరోసారి మలాలాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఇంతకు ముందు జరిగిన తప్పు మరోసారి జరగదంటూ మలాలాను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. అనంతరం ఆ ఖాతాను ట్విటర్‌ తొలగించింది. అనంతరం తనపై కాల్పులు జరిపిన కేసులో కీలక వ్యక్తి జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడంటూ..మలాలా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, పాకిస్థాన్‌ సైన్యాన్ని ప్రశ్నించింది. ‘‘త్వరగా ఇంటికి రా..నీతో, నీ తండ్రితో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. ఈ సారి తప్పు జరగదు.’’ అంటూ ఇషానుల్లా ట్వీట్‌ చేశాడు.

పాకిస్థాన్‌లో బాలికల విద్యపై పోరాటం చేస్తున్న మలాలాపై 2012లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో కీలక సూత్రధారి అయిన ఉగ్రవాది ఇషానుల్లా 2017లో పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం 2020 జనవరిలో తాను జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుపుతూ ఆయన వీడియో విడుదల చేశాడు. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలతో కూడా ఆయన ట్విటర్‌లోనే సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇషానుల్లాకు చాలా ట్విటర్‌ ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు. మలాలాపై కాల్పుల ఘటనతో పాటు, 2014లో పెషావర్‌ ఆర్మీ పాఠశాలపై జరిగిన దాడిలో కూడా అతడి హస్తం ఉంది. మలాలా ప్రస్తుతం లండన్‌లో నివసిస్తోంది. బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న పోరాటానికి గాను 2014లో ఆమెను నోబెల్‌ పురస్కారం వరించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని