దిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధింపు

తాజా వార్తలు

Published : 06/04/2021 12:13 IST

దిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధింపు

నేటి నుంచి ఏప్రిల్‌ 30 వరకు అమల్లో ఉండనున్న ఆంక్షలు

దిల్లీ: దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తుండటంతో..వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాలు, నగరాలు కఠిన ఆంక్షల అమలుకు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా దిల్లీ ప్రభుత్వం ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని వాటిలో పేర్కొంది. దిల్లీలో ప్రస్తుతం నాలుగో దఫా వైరస్‌ విజృంభణ కనిపిస్తోందని, అయితే లాక్‌డౌన్ యోచన లేదని శుక్రవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సరైన సంప్రదింపుల అనంతరమే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

గడిచిన 24 గంటల్లో దిల్లీలో 3,548 మందికి కరోనా సోకగా.. 15 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 6,79,962 మంది వైరస్ బారినపడ్డారు. 11,096 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని