Singhu border killing: ఆ హత్య నేనే చేశా.. లొంగిపోయిన నిందితుడు!

తాజా వార్తలు

Published : 15/10/2021 22:31 IST

Singhu border killing: ఆ హత్య నేనే చేశా.. లొంగిపోయిన నిందితుడు!

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న సింఘు సరిహద్దు హత్యకు సంబంధించి ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. ఆ హత్య తానే చేశానని అంగీకరిస్తూ ఓ వ్యక్తి తమకు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించామని.. శనివారం అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. నిందితుడిని నిర్ధారించేందుకు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వీడియోను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

దిల్లీలోని సింధు సరిహద్దు వద్ద రైతులు నిరసన చేపట్టే వేదికకు సమీపంలో లాఖ్‌బీర్‌సింగ్‌ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. వేదికకు సమీపంలో ఉన్న బారికేడ్‌కు అతడి మృతదేహం వేలాడుతున్న విషయాన్ని శుక్రవారం ఉదయం రైతులు గుర్తించారు. అతడి మణికట్టును కోసి దారుణంగా హత్య చేశారు. ఆందోళన చేస్తోన్న ప్రధాన వేదికకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో రైతుల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఇది పంజాబ్‌, హరియాణాలోని ప్రధాన వర్గంలోని తిరుగుబాటుదారులైన నిహంగాల పనేనని సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) ఆరోపించింది. ఈ దారుణ ఘటనపై దర్యాప్తునకు పోలీసులకు సహకరిస్తామని ఎస్‌కేఎం వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని