ఉచిత టీకా దిశగా బిహార్‌ ముందడుగు

తాజా వార్తలు

Published : 16/12/2020 09:37 IST

ఉచిత టీకా దిశగా బిహార్‌ ముందడుగు

పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే కూటమి ఇచ్చిన కీలక హామీని నెరవేర్చే దిశగా అక్కడి ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందించాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని కేబినెట్‌ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపౌరుడికీ టీకా అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని మంగళవారం ఆరోగ్యశాఖ అధికారుల్ని సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆదేశించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తొలుత వైద్యారోగ్య, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి టీకా అందించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తర్వాత వయస్సు, అనారోగ్య సమస్యల వంటివాటిని పరిగణనలోకి తీసుకొని ప్రాథమ్యాలను నిర్ణయిస్తామని వెల్లడించారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తారాకిశోర్‌ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలోని ప్రతిపౌరుడికీ కరోనా టీకా అందజేయాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. వ్యాక్సిన్‌కు అనుమతి లభించగానే.. కావాల్సిన టీకాలను సమకూర్చుకొని ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ‘ఓ పెద్ద వరం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. బిహార్‌లో ఉన్న మానవ వనరులే రాష్ట్రానికి గొప్ప శక్తి అని.. దాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఇతర హామీలపైనా కేబినెట్‌ చర్చించినట్లు సమాచారం.

ఇవీ చదవండి..

కొవిడ్‌ టీకా: పారదర్శకంగా లేని చైనా!

రాష్ట్రంలో 50 వేల మందికి శిక్షణ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని