18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌!

తాజా వార్తలు

Published : 17/02/2021 15:55 IST

18 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రోజురోజుకు రికవరీల సంఖ్య కూడా పెరుగుతుండటం సానుకూల పరిణామంగా పేర్కొంది. 

‘గడిచిన 24 గంటల్లో దేశంలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విషయానికొస్తే.. బుధవారం ఉదయం 8గంటల సమయం వరకు దేశవ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 90 లక్షల మార్కు అందుకుంది. వారిలో 61లక్షల మంది ఆరోగ్య సిబ్బంది తొలి డోసు పూర్తి చేసుకోగా.. రెండో డోసు పూర్తి చేసుకున్నారు 2.76లక్షల మంది ఉన్నారు. టీకా కారణంగా విషమ పరిస్థితులు తలెత్తిన కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు’ అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.76లక్షల టీకాలు వేయగా.. అందులో 1.60లక్షలు తొలి డోసు వేయించుకున్న వారు కాగా.. 1.16లక్షల మంది రెండో డోసు వేయించుకున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది . 

కాగా కేంద్ర ఆరోగ్యశాఖ ఫిబ్రవరి 13 నుంచి కొవిడ్‌ టీకా రెండో డోసు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి డోసు తీసుకుని 28 రోజులు పూర్తి చేసుకున్న వ్యక్తులకు రెండో డోసు వేస్తున్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని