కరోనా అప్‌డేట్‌: 15 రాష్ట్రాల్లో మరణాల్లేవ్‌!

తాజా వార్తలు

Updated : 09/02/2021 20:44 IST

కరోనా అప్‌డేట్‌: 15 రాష్ట్రాల్లో మరణాల్లేవ్‌!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకు తగ్గుతుండటం ఉపశమనాన్ని కలిగించే విషయమని కేంద్రం వెల్లడించింది. దేశంలో రోజువారి కరోనా వైరస్‌ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా చోటుచేసుకోలేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం మీడియాతో వెల్లడించారు. ‘గడిచిన 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. ఇప్పటికే గత వారం రోజుల నుంచి ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు’ అని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. 

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడమే కాక.. గడిచిన ఒక రోజు వ్యవధిలో దిల్లీలో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం శుభపరిణామం. రోజువారీ మరణాలు సగటున దాదాపు 55శాతం తగ్గింది. ఏదేమైనప్పటికీ మన జనాభాలో 70శాతం ప్రజలకు హాని ఉందని సెరో సర్వే చెబుతోంది. కాబట్టి జాగ్రత్త చర్యలు ఇంకా కొంత కాలం కొనసాగించడం ఎంతో ముఖ్యం’ అని సూచించారు. 

గడిచిన 24గంటల్లో దాదాపు 9వేల కేసులు నమోదు కాగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.43లక్షలు ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం 1.30గంటల వరకు 63లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకా ప్రక్రియ 65శాతానికి పైగా పూర్తైందని, మరో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 40శాతానికి తక్కువ మాత్రమే ఆరోగ్య సిబ్బందికి టీకా పూర్తైనట్లు కేంద్రం పేర్కొంది. 

ఇదీ చదవండి

ఆజాద్‌కు వీడ్కోలు.. మోదీ కన్నీళ్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని