
తాజా వార్తలు
ఆ రెండు టీకాలూ సురక్షితమే: శివరాజ్
భోపాల్: కొవాగ్జిన్, కొవిషీల్డ్.. ఈ రెండు టీకాలూ సురక్షితమైనవేనని, ఈ రెండింటి మధ్య తేడా ఏమీ లేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఈ నెల 16 నుంచి తొలి దశ టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు టీకాలకు మన శాస్త్రవేత్తలు అన్ని పరీక్షలు జరిపి.. వినియోగించవచ్చని నిర్ణయించారని తెలిపారు. ఈ టీకాలు రోగనిరోధక శక్తిని, యాంటీబాడీలను శరీరంలో నెలకొల్పుతాయన్నారు.
వ్యాక్సినేషన్ పూర్తయిన వెంటనే యాంటీబాడీలు అభివృద్ధి కావన్నారు. తొలి డోస్ ఇచ్చిన 28 రోజులకు రెండో డోస్ ఇస్తారన్నారు. ఈ రెండు డోసుల వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెప్పారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి రోజు 3లక్షలమంది ఆరోగ్య కార్యకర్తలకు అందించనున్నారు.
ఇదీ చదవండి..
Tags :