గుడ్‌న్యూస్‌: 17 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌..!

తాజా వార్తలు

Published : 08/02/2021 17:09 IST

గుడ్‌న్యూస్‌: 17 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌..!

దేశంలో క్రమంగా తగ్గుతున్న మహమ్మారి

దిల్లీ: కరోనా మహమ్మారి కోరల నుంచి భారత్‌ నెమ్మదిగా బయటపడుతోంది. నిబంధనలతో వ్యాప్తిని కట్టడిచేయడంతో పాటు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రావడంతో గత కొంతకాలంగా రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా మరణాలు 150కి దిగువనే ఉండగా.. గడిచిన 24 గంటల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్‌ మరణం కూడా నమోదుకాకపోవడం ఊరటనిస్తోంది. 

అండమాన్‌ నికోబార్‌, డామన్‌ డయ్యు, దాద్రానగర్‌ హవేలీ, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, మిజోరం, నాగాలండ్‌, లక్షద్వీప్‌, లద్దాఖ్‌, సిక్కిం, రాజస్థాన్‌, మేఘాలయ, మధ్యప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో కరోనా మరణాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,831 కొత్త కేసులు బయటపడగా.. 11,904 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా మరో 84 మంది నిన్న ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,606 కరోనా యాక్టివ్‌ కేసులుండగా.. ఇందులో 70శాతం కేవలం కేరళ, మహారాష్ట్రల్లోనే ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ కొత్త కేసులు అత్యధికంగా కేరళలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 6,075 కేసులు బయటపడగా.. ఆ తర్వాత మహారాష్ట్రలో 2,673, కర్ణాటకలో 487 కొత్త కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. రోజువారీ మరణాలు మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్నాయి. నిన్న అక్కడ 30 మంది కరోనాతో మరణించగా.. కేరళలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం ఉదయం 8 గంటల నాటికి 58,12,362 మంది టీకా తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇవీ చదవండి..

టీకా ఉత్పత్తిలో భారత్‌ది వ్యూహాత్మక పాత్ర

కరోనా మరణాలు @ 84


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని