కనీస వేతన నిర్ణయంపై కేంద్రం క్లారిటీ
close

తాజా వార్తలు

Published : 19/06/2021 16:21 IST

కనీస వేతన నిర్ణయంపై కేంద్రం క్లారిటీ

దిల్లీ: కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలను నిర్ణయించే విషయంలో జాప్యం చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆలస్యం చేసే ఉద్దేశంతోనే కనీస వేతనాల నిర్ణయానికి నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందంటూ వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టతనిచ్చింది.

కనీస వేతన అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త అజిత్‌ మిశ్రా నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని కేంద్రం ఇటీవల నియమించింది. దీని పదవీ కాలం మూడేళ్లుగా నిర్దేశించింది. దీంతో వేతన నిర్ణయాన్ని మరింత జాప్యం చేసేందుకే మూడేళ్ల కాలానికి నిపుణుల కమిటీని కేంద్రం నియమించిందంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఓ వర్గం చేస్తున్న మీడియా ప్రచారంగా దీన్ని కేంద్రం కొట్టిపారేసింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, నిపుణుల కమిటీ వీలైనంత తొందరగా తన నివేదికను సమర్పిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కమిటీ తొలి సమావేశం జూన్‌ 14న జరగ్గా.. రెండో సమావేశం జూన్‌ 29న జరగనుందని తెలిపింది. వివిధ వృత్తులను బట్టి కనీస వేతనం అనేది ఉంటుంది. కానీ అన్ని వృత్తుల వారికి కనీస వేతనం ఉండడాన్ని జాతీయ ప్రామాణిక వేతనంగా పేర్కొంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని