సింగపూర్‌ వేరియంట్‌ కాదు... అది B.1.617.2

తాజా వార్తలు

Published : 19/05/2021 10:09 IST

సింగపూర్‌ వేరియంట్‌ కాదు... అది B.1.617.2

దిల్లీ: సింగపూర్‌లో కరోనా కొత్తరకం ప్రబలుతోందని, ఆ దేశం నుంచి విమాన సర్వీసులు రద్దు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. అది సింగపూర్‌ వైరస్‌ రకం కాదని, భారత్‌లో కన్పించిన వేరియంటేనని వెల్లడించింది. ఈ మేరకు దిల్లీలోని సింగపూర్‌ హైకమిషన్‌ ట్విటర్‌ ద్వారా బదులిచ్చింది.

‘‘సింగపూర్‌లో కొవిడ్ కొత్త స్ట్రెయిన్ ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఫిలోజెనెటిక్‌ పరీక్షల ద్వారా అది b.1.617.2 వేరియంట్‌ అని తేలింది. గత కొన్ని వారాలుగా సింగపూర్‌లో నమోదైన చాలా కేసులకు(పిల్లలతో సహా) ఈ స్ట్రెయినే కారణం’’ అని ఎంబసీ ట్వీట్‌ చేసింది. సింగపూర్‌లో ప్రబలుతున్న కొత్త రకం వైరస్‌ చిన్నారులకు ప్రమాదకరమని కేజ్రీవాల్ నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఆ దేశం నుంచి విమానసర్వీసులు నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అయితే దీనికి కేంద్ర విమానాయానశాఖ స్పందిస్తూ.. ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తెచ్చే విమానాలు మాత్రమే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా, భారత్‌లో కన్పించిన కొవిడ్‌ లక్షణాలు తమ దేశంలోనూ కన్పించడంతో బుధవారం నుంచి దేశంలోని బడులన్నీ మూసివేయాలని సింగపూర్‌ నిర్ణయించింది. సింగపూర్‌లో తాజాగా 38 కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఎక్కువ మంది పిల్లలే. అయితే ఎవరికీ పరిస్థితి విషమించలేదని తెలుస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని