యాక్టివ్‌ కేసులు ఆ మూడు రాష్ట్రాల్లోనే..!

తాజా వార్తలు

Published : 15/02/2021 18:52 IST

యాక్టివ్‌ కేసులు ఆ మూడు రాష్ట్రాల్లోనే..!

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ఊరటిస్తోంది. వ్యాప్తిని కట్టడిచేసే నిబంధనలు పాటిస్తుండటం, వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో దేశంలో కరోనా కేసులు గణనీయంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా 188 జిల్లాల్లో గత వారం రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.

18 రాష్ట్రాల్లో ‘సున్నా’ మరణాలు..

గడిచిన 24 గంటల్లో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. అసోం, రాజస్థాన్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, లక్షద్వీప్‌, మేఘాలయ, సిక్కిం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లద్దాఖ్‌, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, డయ్యూ డామన్‌ - దాద్రానగర్‌ హవేవీలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదని వెల్లడించింది. 

ఇక సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 1.39లక్షల యాక్టివ్‌ కేసులుండగా.. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రియాశీల కేసుల సంఖ్య 5వేల లోపే ఉండటం ఊరటనిస్తోంది. అయితే మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 77శాతం కేవలం మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోనే ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90 మంది కరోనాతో చనిపోగా.. ఒక్క మహారాష్ట్రలోనే ఈ సంఖ్య 40గా ఉంది. అక్కడ రోజువారీ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ఇక కేరళలోనూ కరోనా తీవ్రత ఇంకా అధికంగా ఉండటం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని