19 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌

తాజా వార్తలు

Published : 10/02/2021 14:54 IST

19 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: దేశంలో కరోనా ప్రభావం నెమ్మదించింది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. 33 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,000 కన్నా తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయన్నారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో గత మూడు వారాలుగా ఏడురాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.

కాగా బుధవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.08 కోట్లకు చేరుకోగా, 1,55,252 మరణాలు సంభవించాయి. రికవరీ రేటు 97.27 శాతంగా ఉండగా, క్రియాశీల కేసుల సంఖ్య 1.41లక్షలుగా ఉంది. ఆ రేటు 1.30 శాతానికి తగ్గింది. క్రియాశీల కేసుల్లో 71శాతం కేసులు కేరళ, మహారాష్ట్రల నుంచే నమోదయ్యాయని ఆ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 9 నాటికి 66,11,561 మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇవీ చదవండి..

కరోనా జీవాయుధం కాకపోవచ్చు

సైబర్‌ మోసాలతో ‘అణు’ సంపదTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని