close

తాజా వార్తలు

Published : 09/03/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాత్యాహంకారానికి తావులేదు: బ్రిటన్

మేఘన్ ఇంటర్వ్యూపై స్పందన

లండన్‌: తమ దేశంలో జాత్యాహంకారానికి చోటులేదని బ్రిటన్ వెల్లడించింది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన హ్యారీ, మేఘన్ మర్కెల్ దంపతులు అమెరికాలోని పాపులర్ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూ నేపథ్యంలో ఆ దేశం స్పందించింది. ప్రిన్స్‌ హ్యరీని పెళ్లి చేసుకొని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని మేఘన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గర్భవతిగా ఉన్న సమయంలో బిడ్డ రంగు గురించి చర్చ జరిగిందని, నల్లగా పుడతాడనే ఆందోళన వ్యక్తమైందని కన్నీటి పర్యంతమయ్యారు. 

ఈ క్రమంలో ‘తమ సమాజంలో జాత్యాహంకారానికి ఏ మాత్రం తావు లేదు’ అని బ్రిటన్ మంత్రి విక్కీ ఫోర్డ్ మీడియాతో వ్యాఖ్యానించారు. అలాగే తానింతవరకు ఆ ఇంటర్వ్యూను చూడలేదని కూడా చెప్పారు. కాగా, రాజకుటుంబంతో విభేదాల కారణంగా హ్యారీ దంపతులు తమ హోదాలను వీడి, అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.  


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని