Vaccine: ఆ వార్తలు అవాస్తవం
close

తాజా వార్తలు

Published : 30/06/2021 18:37 IST

Vaccine: ఆ వార్తలు అవాస్తవం

పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ సురక్షితమే

తప్పుడు ప్రచారాలను కొట్టిపారేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనా టీకా వేయించుకున్నవారిలో సంతాన సాఫల్యతకు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముందంటూ గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు పాలిచ్చే తల్లులు టీకాలు వేసుకోవడంపైనా అనేక అపోహలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లపై అపోహలను తొలగించేలా వాస్తవాలను తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నేడు మీడియా ప్రకటన వెలువరించింది. కొవిడ్‌ టీకాల వల్ల వంధ్యత్వం వస్తోందనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘాటించింది. 

‘‘దేశంలో అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్‌ కూడా సంతాన సాఫల్యతపై ప్రతికూల ప్రభావం చూపించదు. ఇలాంటి దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయేమో అని తెలుసుకునేందుకే టీకాలను తొలుత జంతువులపై ప్రయోగిస్తారు. ఆ తర్వాత మనుషులపై ప్రయోగాలు చేపడతారు. భద్రత, సమర్థతను పరిశీలించిన తర్వాతే వినియోగానికి ఆమోదిస్తారు. కరోనా టీకాలతో పురుషులు, మహిళల్లో సంతానలేమి ముప్పు ఉందని చెప్పేందుకు ఎలాటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవు’’ అని ఆరోగ్యశాఖ వివరించింది. 

టీకా తీసుకున్నా.. పిల్లలకు పాలివ్వొచ్చు..

ఇక పాలిచ్చే తల్లలకూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితమేనని జాతీయ నిపుణుల బృందం కూడా తెలిపింది. వారు కూడా టీకాలు తీసుకోవచ్చని సిఫార్సు చేసింది. అందువల్ల వ్యాక్సినేషన్‌కు ముందు, తర్వాత కూడా తల్లులు.. పిల్లలకు చనుబాలు ఇవ్వొచ్చని, ఆపాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని