Pakistan: మా దేశంలో అమెరికా స్థావరం లేదు
close

తాజా వార్తలు

Published : 25/05/2021 19:10 IST

Pakistan: మా దేశంలో అమెరికా స్థావరం లేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌లో అమెరికాకు ఎటువంటి పదాతి దళ, వాయుసేన స్థావరాలు లేవని ఆ దేశ మంత్రివిదేశంగ శాఖ మంత్రి ప్రతినిధి జహిద్‌ హఫీజ్‌ చౌధరి ప్రకటించారు. ఆయన సోమవారం రాత్రి హడావుడిగా ఈ ప్రకటన చేశారు. ‘ఇక్కడ అమెరికా ఆర్మీ, వాయుసేనలకు స్థావరాలు లేవు. అటువంటి ప్రతిపాదనలు కూడా ఏమీ లేవు. ఇటువంటి వాటికి సంబంధించిన ఎటువంటి ప్రచారమైన ఆధారరహితమే’’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌-అమెరికా మధ్య 2001 నుంచి ఎయిర్‌లైన్స్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, గ్రౌండ్‌ లైన్స్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ ఉన్నాయి. కొత్త ఒప్పందాలు ఏమీ జరగలేదని ఆయన వెల్లడించారు. 

వాస్తవానికి ఈ రెండు ఒప్పందాలు ఉంటే అమెరికా సేనలు అఫ్గానిస్థాన్‌ మీద దాడి చేయడం సులభం.  తమ దళాలను పాకిస్థాన్‌ భూభాగం, గగనతలం పై నుంచి అఫ్గాన్‌కు పంపే అవకాశం ఉంటుంది. ముషరాఫ్‌ పాలనలో జరిగిన ఈ ఒప్పందాలపై గతంలో వివాదాలు కూడా చెలరేగాయి. వీటిని అమెరికా బెదిరించి పాక్‌తో సంతకాలు చేయించుకొన్నట్లు  కథనాలు వెలువడ్డాయి. 

తాజా వివాదం ఏమీటీ..?

ఇటీవల అమెరికా రక్షణశాఖ అసిస్టెంట్‌ సెక్రటరీ డేవిడ్‌ ఎఫ్‌ హాల్వే  ఆ దేశ సెనెట్‌లో మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పేందుకు పాక్‌ సహకారంపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా సేనలు ఆ దేశ గగనతలం పై నుంచి భూతలంపై ప్రయాణించేందుకు అనుమతిస్తుంది. దీంతో అఫ్గానిస్థాన్లో సైనిక మద్దతు కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు.  ఇది పాకిస్థాన్‌లోని అతివాదులను ఒక్కసారిగా అందోళనకు గురిచేసింది. దీంతో పాక్‌ విదేశాంగ శాఖ నుంచి హడావుడి ప్రకటన వెలువడింది. 

అంతకు మందు ఆదివారం జెనీవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్‌ ఎన్‌ఎస్‌ఏ మోయిద్‌ యూసఫ్‌, అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాక్‌సలేవాన్‌ లు భేటీ అయ్యారు. అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ఇరు దేశాల మధ్య ఉన్నతాధికారులు భేటీ కావడం ఇదే తొలిసారి. వీరిద్దరు ఒకసంయుక్త ప్రకటన విడుదల చేసినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని