Vaccine: అక్కడ టీకా వేయించుకుంటేనే జీతం

తాజా వార్తలు

Published : 02/06/2021 14:20 IST

Vaccine: అక్కడ టీకా వేయించుకుంటేనే జీతం

ఫిరోజాబాద్‌ : దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. 

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని.. టీకాలు తీసుకోకపోతే జీతాలు పొందలేరని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘నో వ్యాక్సినేషన్‌.. నో సాలరీ’కి సంబంధించి జిల్లా కలెక్టర్‌ చంద్ర విజయ్‌ సింగ్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని జిల్లా చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి చర్చిత్‌ గౌర్‌ చెప్పారు.

‘ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కొవిడ్‌ టీకా తీసుకోకపోతే.. సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది. మే నెల జీతాన్ని నిలిపివేస్తుంది’ అని గౌర్‌ వెల్లడించారు. జిల్లా ట్రెజరీ అధికారులకు, ఆయా విభాగాధిపతులకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు పంపినట్లు ఆయన తెలిపారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలని ఆయన కోరారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ టీకాలు తీసుకున్న వారి సంఖ్య 21,85,46,667కి చేరింది. నిన్న 23,97,191 టీకాలు వేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని