China: బుద్ధి మారని చైనా

తాజా వార్తలు

Updated : 22/09/2021 05:10 IST

China: బుద్ధి మారని చైనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంట్లో నలుసు, పంటి కింద రాయి. పదాలు ఏవైనా పొరుగు దేశం చైనా తీరు మాత్రం అచ్చంగా ఇదే. అనవసర సమస్యలు సృష్టించడంలో పాకిస్తాన్‌తో పోటీ పడుతున్న చైనా తూర్పు లద్దాఖ్ వివాదం మరవక ముందే ఇప్పుడు కొత్త కుట్రకు తెరతీసింది. ఉత్తరాఖండ్ , అరుణాచల్  ప్రదేశ్‌కు సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కొత్తగా 10 వైమానిక స్ధావరాలను డ్రాగన్  నిర్మిస్తోంది. ఇటీవల ఇరుదేశాల మధ్య విదేశాంగ మంత్రుల చర్చల్లో శాంతి మంత్రం వల్లించినా చైనా తమ బుద్ధి మారలేదని చాటుకుంటోంది.

2020 మేలో తూర్పు లద్ధాక్‌లో సరిహద్దు ఆక్రమణకు యత్నించి భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన చైనా రోజుకొక కుట్రతో కవ్వింపు చర్యల్లో పాకిస్తాన్‌తో పోటీపడుతోంది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే చర్యను మానడం లేదు. వాస్తవాధీన రేఖవద్ద శాంతిని పాటించాలని తజకిస్తాన్‌ రాజధాని దుషాన్‌బే వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జయశకంకర్‌, వాంగీ మధ్య భేటీలో ఈనెల 16న నిర్ణయం తీసుకోగా అంతలోనే చైనా కుట్రకు సంబంధించి కొత్త విషయం బయటకు వచ్చింది. అరుణాచల ప్రదేశ్‌ ఉత్తరాఖండ్‌కు సమీపంలోని వాస్తవాధీన రేఖవద్ద చైనా కొత్తగా 10 వైమానిక స్థావరాలను నిర్మిస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం ఉన్న వైమానిక స్థావరాల వద్ద కూడా చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని తేలింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చల మాటునే భారత్‌ను అస్థిరపరిచే కుట్రలకు చైనా తెరతీసింది. చైనా వైమానిక స్థావరాల నిర్మాణం చాలా తీవ్రమైన విషయమని కేంద్ర హోంశాఖ వర్గాలు అభివర్ణించాయి. చైనా కవ్వింపు చర్యలను ఎదుర్కొనేందుకు భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించినా అవి ఏమాత్రం సరిపోవని నిపుణుల అభిప్రాయం. తూర్పు లద్ధాఖ్‌ వివాదం తర్వాత చైనాకు సమీపంలో బలగాలను పెంచడం సహా మౌలిక సదుపాయాలను భారత్‌ భారీ ఎత్తులో అభివృద్ధి చేస్తోంది. బలగాలు, ఆయుధాలను వేగంగా చేరవేసేందుకు ఆ ప్రాంతంలో 73 రహదారులను నిర్మిస్తోంది. సరిహద్దుల వద్ద సైనిక సన్నద్ధత, మౌలిక సదుపాయాల కల్పనపై రక్షణ శాఖ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. అయితే చైనా దూకుడు ముందు ఈ వేగం ఏమాత్రం సరిపోదని సైనిక నిపుణులు అంటున్నారు. అటు వాస్తవాధీన రేఖ వద్ద వైమానిక స్థావరాలు నిర్మిచడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని