ఈ సారి కిమ్‌ సతీమణి వంతు..!

తాజా వార్తలు

Published : 17/02/2021 11:26 IST

ఈ సారి కిమ్‌ సతీమణి వంతు..!

 బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చిన రి సోల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఉత్తర కొరియాలో ఎప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారో.. ఎవరు మాయమవుతారో తెలియదు. కొన్నాళ్లు కిమ్‌  కనిపించక పోతే.. మరికొన్నాళ్లు కిమ్‌ సోదరి కనిపించరు.. వీరిద్దరు కాకపోతే కిమ్‌ భార్య కనిపించరు. ఆ తర్వాత ఎప్పుడో మళ్లీ బాహ్య ప్రపంచం ముందుకొచ్చి ఆశ్చర్యపరుస్తారు. ఈ లోపు రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తాయి. ఈ సారి కిమ్‌ భార్య రి సోల్‌-జు వంతు వచ్చింది. ఏడాది పాటు అజ్ఞాతంలో ఉన్న ఆమె తాజాగా బాహ్య ప్రపంచం ముందుకొచ్చారు. మంగళవారం తన భర్త  కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో కలిసి తన మామ దివంగత కిమ్‌జోంగ్‌ ఇల్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

అధ్యక్షుడు అని సంబోధించిన మీడియా..!

కిమ్‌ దంపతులు మేన్సుడే ఆర్ట్‌ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో  ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎవరూ మాస్కులు ధరించకపోవడం గమనార్హం.  ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు కిమ్‌ ది కుమ్సాన్‌ ప్యాలెస్‌ ఆఫ్‌ ది సన్‌లో తన తండ్రి, తాతల సమాధులను దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమాలను రిపోర్టు చేసిన ఉత్తరకొరియా మీడియా కిమ్‌ను మరోసారి ప్రెసిడెంట్‌ అని సంబోధించడం విశేషం. వాస్తవానికి ఉ.కొరియా అధినేతను ఛైర్మన్‌ అని సంబోధిస్తారు. గత వారం కూడా ఉ.కొరియా న్యూస్‌ ఏజెన్సీ ఇదే విధంగా సంబోధించింది. ‘ప్రెసిడెంట్‌ ’ అనే టైటిల్‌ ఉ.కొరియాలో ఇప్పటి వరకు దేశ వ్యవస్థాపకుడైన్‌ కిమ్‌-ll- సంగ్‌కు మాత్రమే వినియోగించారు. ఆయన ప్రస్తుత నియంత కిమ్‌ తాత.

గతంలో కిమ్‌తోపాటు రి సోల్‌ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గత జనవరి తర్వాత ఆమె బాహ్యప్రపంచం ముందుకు రాలేదు. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మరో బిడ్డకు జన్మనివ్వనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాస్తవానికి కొవిడ్‌ కారణంగా ఆమె బాహ్యప్రపంచం ఎదుటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు నివేదికలు ఇచ్చాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని