అంగుళం భూమి కూడా కోల్పోలేదు: ఆర్మీ చీఫ్‌ 
close

తాజా వార్తలు

Published : 31/03/2021 01:18 IST

అంగుళం భూమి కూడా కోల్పోలేదు: ఆర్మీ చీఫ్‌ 

దిల్లీ: లద్దాఖ్‌ నుంచి భారత్‌- చైనా బలగాల ఉపసంహరణపై భారత ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఒక్క అంగుళం భూమిని కూడా కోల్పోలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనాతో వివాదానికి ముందు నెలకొన్న ప్రశాంత వాతావరణమే ఉందని.. మనం ఏ భూభాగాన్నీ కోల్పోలేదని తెలిపారు. చర్చల ద్వారానే పరిష్కారానికే భారత్‌ ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రస్తుతం గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ వంటి ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ కోసం చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. పాకిస్థాన్‌, చైనా ఈ రెండు దేశాల నుంచి భద్రతాపరమైన ముప్పు ఉన్నందున ఆ దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

భారత్‌, చైనా రెండు దేశాలూ గత నెలలో సైనిక బలగాలను, యుద్ధ ట్యాంకులను ప్యాంగాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో చైనా బలగాలు భారత్‌ భూభాగంలోకి అక్రమంగా చొరబడటంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఏర్పడిన ప్రతిష్టంభణ కొన్ని నెలల పాటు కొనసాగింది. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌ 15న గల్వాన్‌ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన ఘటన యావత్‌ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు, ఈ ఘటనలో చైనా వైపు జరిగిన ప్రాణ నష్టాన్ని తక్కువగా చూపేందుకు డ్రాగన్‌ ప్రయత్నిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని