Facebook: వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే..!
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 12:50 IST

Facebook: వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎదుట హాజరయ్యే అంశంలో ఫేస్‌బుక్‌కు ఊరట లభించలేదు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కమిటీ ప్రజల హక్కులు కాపాడటం, సోషల్‌ మీడియా వేదికల దుర్వినియోగాన్ని అడ్డుకొనే అంశంపై విచారణ చేపట్టింది. కానీ, ఫేస్‌బుక్‌ యాంటీ కొవిడ్‌ పాలసీ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని.. వర్చువల్‌గా ప్యానల్‌ ఎదుటకు వస్తామని కోరింది. కానీ, పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం వర్చువల్‌ సమావేశాలను రద్దు చేసినట్లు ప్యానల్‌ పేర్కొంది. అవసరమైతే పార్లమెంట్‌ సచివాలయంలో ఆ సిబ్బందికి టీకాలు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తామని శశిథరూర్‌ వెల్లడించారు.

ఇప్పటికే ట్విటర్‌ ప్రతినిధులను ఈ కమిటీ దాదాపు 90 నిమిషాలపాటు ప్రశ్నించింది.  ప్రభుత్వం  ప్రకటించిన సరికొత్త సోషల్‌ మీడియా నిబంధనల అమలులో జాప్యంపై వివరణ అడిగింది. దీనికి ట్విటర్‌ ఇచ్చిన సమాధానాలు.. కమిటీని సంతృప్తి పర్చలేకపోయినట్లు సమాచారం.  దేశ చట్టాలను ఉల్లంఘించినందుకు ట్విటర్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని స్థాయీ సంఘం గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కేంద్రానికి, ట్విటర్‌కు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త ఐటీ నిబంధనలను గడువులోగా ట్విటర్‌ పాటించకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు టూల్‌కిట్‌ వ్యవహారం, పలువురు ప్రముఖుల ఖాతాలకు బ్లూటిక్‌ తొలగింపు అంశాలు ఈ దూరాన్ని మరింతగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ట్విటర్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘మా విలువలు, పారదర్శకత, భావప్రకటనా స్వేచ్ఛతో ఆన్‌లైన్‌లో ప్రజల హక్కులు కాపాడేందుకు కమిటీతో కలిసి పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని