OBC Bill: లోక్‌సభలో ఓబీసీ బిల్లు.. మద్దతు పలికిన ప్రతిపక్షాలు

తాజా వార్తలు

Updated : 10/08/2021 15:02 IST

OBC Bill: లోక్‌సభలో ఓబీసీ బిల్లు.. మద్దతు పలికిన ప్రతిపక్షాలు

దిల్లీ: రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని కట్టబెడుతూ తీసుకువచ్చిన బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరుగుతోంది. కాగా, ఈ 127వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో విపక్షాలు ప్రభుత్వానికి అంతకుముందే మద్దతు ప్రకటించాయి. అందుకు తగ్గట్టే బిల్లుపై చర్చ జరుగుతోన్న సమయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా చర్చలో పాల్గొన్నాయి. అలాగే తాము ఓబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురీ వెల్లడించారు.

మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడిన రాజ్యసభ..

పెగాసస్ హ్యాకింగ్, రైతు చట్టాలు వంటి అంశాలపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. విపక్షాల ఆందోళనలతో  తాజాగా రాజ్యసభను మరోసారి మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేయాల్సి వచ్చింది.

గైర్హాజరైన సభ్యులపై మోదీ అసహనం..

పార్లమెంట్‌లో పలు బిల్లులు ఆమోదించే సమయంలో పలువురు భాజపా ఎంపీలు గైర్హాజరు కావడంపై ప్రధాని మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ఆయన వారి పేర్లను అడిగి తెలుసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాజ్యసభ సమావేశాలకు భాజపా ఎంపీలు కొందరు హాజరు కాలేదు. దీని గురించి ఈ రోజు జరిగిన పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ప్రశ్నించారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. రాజ్యసభలో పలు కీలక బిల్లుల్ని ఆమోదించనున్న నేపథ్యంలో పార్టీ సభ్యులంతా మంగళ, బుధవారాల్లో తప్పక హాజరు కావాలని నిన్న భాజపా ఆదేశాలు ఇచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని