దేశానికే స్టీల్‌హబ్‌గా మారనున్న ఒడిశా! 

తాజా వార్తలు

Updated : 08/07/2021 04:52 IST

దేశానికే స్టీల్‌హబ్‌గా మారనున్న ఒడిశా! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజన్‌ 2030లో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తమ రాష్ట్రాన్ని దేశానికే స్టీల్‌ హబ్‌గా మార్చాలనే దూరదృష్టితో ఐదు భారీ పారిశ్రామిక పథకాలకు అనుమతి ప్రసాదించారు. తన నేతృత్వంలో నడిచే 26వ హై లెవెల్‌ క్లియరెన్స్‌ అథారిటీ తరఫున 1.46 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సూత్రప్రాయంగా అంగీకరించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ ఒడిశా 2.96 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది. స్టీల్‌ ఉత్పత్తిలో ఒడిశా 2000 సంవత్సరంలో 2 మిలియన్‌ టన్నులు కాగా.. 2020 నాటికి  20 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర స్టీల్‌ ఉత్పత్తి 30 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. మరికొన్ని సంవత్సరాల్లోనే ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నదానికి రెండింతలు స్టీల్‌ను తయారు చేయాలనేదే ప్రభుత్వ విజన్. ప్రస్తుతం అంగీకరించిన ఐదు పెద్ద ప్రాజెక్టులతో 27వేల ఉద్యోగాల సృష్టి జరుగుతోందని అంచనా! 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని